త్వరలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2020లో నిర్వహించే పురుషుల, మహిళల ప్రపంచ కప్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఈసారి మహిళా, పురుషుల టీ20 ప్రపంచకప్‌లను ఒకే వేదికగా ఒకే సంవత్సరంలో నిర్వహించనుంది. అయితే ముందుగా ఫిబ్రవరిలో మహిళా టీ20 వరల్డ్ కప్ జరగనుండగా, తరువాత అక్టోబర్‌లో పురుషుల టోర్నీ జరగనుంది. ఈ రెండు టోర్నీలకు ఆసీస్ లోని మొత్తం 13 వేదికలు… ఇరు టోర్నీల ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రం మెల్బోర్న్ మైదానం ఆదిత్యమివ్వబోతుంది. మహిళా టోర్నీల్లో మొత్తం 10 జట్లు పోటీపడనుండగా.. పురుషుల టోర్నీలో 12 జట్లు పోరుకు సిద్ధమవుతున్నాయి.
మహిళల ప్రపంచ కప్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభంకానుంది. ఢిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు మొదటి మ్యాచ్‌లో తలపడనుంది. మర్చి 8 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక పురుషుల ప్రపంచకప్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరనున్నాయి. పురుషుల టోర్నీకి ఆసీస్-పాకిస్తాన్ మ్యాచ్‌తో పోరు మొదలవుతుంది. కోహ్లిసేన మాత్రం అక్టోబర్ 24న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇరు టోర్నీల్లో ఆయా జట్లను రెండు గ్రూప్‌లుగా ఐసీసీ విభజించింది. మహిళా టోర్నీలో సూపర్ 10, పురుషుల టోర్నీ సూపర్ 12 పద్దతిలో నిర్వహించనుంది.
పురుషుల వరల్డ్ కప్:
సూపర్ 12 గ్రూప్ మ్యాచ్‌లు :అక్టోబర్ 24-నవంబర్ 8
గ్రూప్ 1 : పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2
గ్రూప్ 2 : భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గనిస్థాన్, క్వాలిఫయర్-3, క్వాలిఫయర్-4
సెమీ ఫైనల్స్ : నవంబర్ 11, 12
ఫైనల్స్ : నవంబర్ 15
మహిళల వరల్డ్ కప్:
సూపర్ 10 గ్రూప్ మ్యాచ్‌లు : ఫిబ్రవరి 21-మార్చి 3
గ్రూప్ ఏ :ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్, శ్రీలంక, క్వాలిఫయర్ 1
గ్రూప్ బి :ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, క్వాలిఫయర్ 2
సెమీఫైనల్స్: మార్చి 5
ఫైనల్: మార్చి 8