సాధారణంగా క్రికెట్ లో మనం ఒక్క బంతికి ఒక సిక్స్ కొట్టడం చూస్తుంటాం, కానీ ఊహకందని ఒక సంఘటన ఆదర్శ్ క్రికెట్ క్లబ్(మహారాష్ట్ర ) నిర్వహించిన పోటీలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే .. క్రకెట్ క్లబ్(మహారాష్ట్ర) నిర్వహించిన క్రికెట్ పోటీల్లో భాగంగా స్థానిక జట్లైన దేశాయ్- జుని డోంబివ్లి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఆటలో భాగంగా దేశాయ్‌కు జట్టుకు జుని జట్టుపై గెలవడానికి గెలవడానికి 6 పరుగులు కావాల్సివచ్చింది. కానీ అదే ఆఖరి ఓవర్ కావడంతో పైగా ఒకే ఒక్క బంతి మిగిలివుంది ఒక్క సరిగా అభిమానులలో అటు ఆటగాళ్లలో ఉత్కంఠ నెలకొంది. అందరూ సిక్స్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో బౌలర్ మొదటి బంతి వేసాడు, అది కాస్త వైడ్ వెళ్ళింది. రొండో బంతి పడింది అది కూడా వైడ్.. అలా వేసిన ప్రతి బంతి వైడ్లుగా పడడంతో దేశాయ్ జట్టు చివరి బంతి ఆడకుండానే ఆరు పరుగులు దేశాయ్ జట్టు ఖాతాలో చేరాయి. మరో బంతి మిగిలి ఉండగానే జుని జట్టుపై దేశాయ్ జట్టు అనూహ్యంగా విజయం సాధించింది.
క్రికెట్ చరిత్రలో చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిచిన సందర్భాలు చాలానే ఉన్నా, ఈ మ్యాచ్ లో మాత్రం సిక్స్ కొట్టకుండానే ఆరు పరుగులు రావడం విశేషం. గతేడాది నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తిక్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇప్పుడు మాత్రం వైడ్లు రోపంలో జుని డోంబివ్లి జట్టు ఓటమిపాలైంది.