Breaking News

అఖండ విజయానికి కారణాలివే…!

యావత్ తెలంగాణ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. తాజా ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమతి(టీఆర్ఎస్‌) విజయ ఢంకా మోగించి, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను సాధించింది. దీంతో తెలంగాణలో రెండోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్‌ దక్కించుకున్నటైంది. నాలుగు ప్రతిపక్షపార్టీలు ప్రజాకూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగినా, టీఆర్ఎస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ తానై ముందుండి నడిపించారు.

క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా తనని చూసి ఓటేయాలని ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌ విజయానికి గల కారణాలను ఓసారి విశ్లేషిస్తే..

ప్రభుత్వ పథకాలు:

టీఆర్ఎస్‌ మరోసారి అధికారం చేజిక్కించుకో వడంలో ప్రభుత్వ పథకాలది కీలక పాత్ర. తెలంగాణ రాష్ట్ర ప్రకటన అనంతరం 2014 ఎన్నికల్లో ఉద్యమ పార్టీగా బరిలోకి దిగిన గులాబీదళం 63 స్థానాలను గెలిచి, అలవోకగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలు మరోసారి టీఆర్ఎస్‌ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించాయి. ఇలాంటి వాటిలో విద్యుత్ సమస్యను పరిష్కరించడం టీఆర్ఎస్‌ ప్రభుత్వం సాధించిన మొదటి విజయం చెప్పవచ్చు.

రైతులకు రూ. లక్ష రుణమాఫీ చేయడం, రైతుబంధు’, ‘రైతు బీమా’ వంటి పథకాలతో చిన్న, సన్నకారు రైతులు లబ్ది పొందా రు. ఆసరా పింఛన్లు పెంచడంతో పాటు, ‘కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్’ వంటి పథకాలను ప్రవేశపెట్టి రూ.1,00116 ఆర్థిక సాయం అందించడం గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల్లో జరిగే పెళ్లికి ఆర్థిక అండ లభించినట్లైంది. నీళ్లు, నిధుల కోసం పోరాటంతో వచ్చిన తెలంగాణకు ప్రధాన సమస్య జల వనరులు. దానితో ప్రాజెక్టుల నిర్మాణంపై టీఆర్ఎస్‌ దృష్టి సారించింది. ఇందులో భాగంగా కృష్ణా, గోదావరి నదులపై 36 చిన్నా, పెద్ద ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీ య, ఇంటింటికి నీళ్లు అందించే మిషన్ భగీరథ వంటి పథకాల ను అమలు చేసింది. తెలంగాణలో భౌగోళికంగా కొన్ని జిల్లాల్లో అటవీ ప్రాంతం ఎక్కువ. ఈ నేపథ్యంలోజిల్లా కేంద్రాలకు చేరుకోవాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు.

పరిపాలన సంస్కరణల్లో భాగంగా 31 కొత్త జిల్లాలు, 26 కొత్త డివిజన్లు, 125 కొత్త మండలాలు, 4380 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడానికి మార్గం సుగమమైంది. లి ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలు టీఆర్ఎస్‌వైపు మొగ్గు చూపడంలో కీలక పాత్ర పోషించాయి. కేసీఆర్ కిట్, కంటి వెలుగు, అమ్మ ఒడి, బస్తీ దవాఖానాలు అమలులో జాగ్రత్తలు తీసుకున్నారు. పరిశ్రమల ఏర్పాటులోనూ టీఆర్ఎస్‌ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది. ఇందులో భాగంగా టీఎస్ ఐపాస్తో చట్టం తీసుకొచ్చి త్వరతిగతిన పరిశ్రమలకు అనుమతులిచ్చింది.

leave a reply