శ్రీలంకకు ఊహించని…షాక్!

గత సంవత్సరం విశ్వవిజేతగా నిలిచిన మాజీ ఛాంపియన్ శ్రీలంకకు గట్టి షాక్ తగిలింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు ఈ సారి నేరుగా అర్హత సాధించలేకపోయింది. నేరుగా అర్హత సాధించిన జట్ల వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. అయితే ఏ ఎంపిక విధానం టీ20 ర్యాంకింగ్స్‌ ను బట్టి టాప్-10లో ఉన్న ఎనిమిది జట్లు సూపర్-12 స్టేజ్‌కు నేరుగా అర్హత సాధించాయి, మరో రెండు జట్లు మాత్రం గ్రూప్ స్టేజ్‌లో తలపడి ఈ రౌండ్‌కు అర్హత సాధించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31, 2018 వరకు ఉన్న టీ20 ర్యాంకింగ్స్ ఆధారం చేసుకొని ఎనిమిది జట్లు అర్హత సాధించడం జరిగింది.

అయితే టాప్-10 జట్లలో లంకతో పాటు బంగ్లాదేశ్ కూడా అర్హత సాధించలేదు. అర్హత సాధించిన జట్ల వివరాలు… పాకిస్తాన్‌, భారత్‌, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్ఘానిస్తాన్‌ జట్లు నేరుగా సూపర్ 12 స్టేజ్‌కు అర్హత సాధించగా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లకు మాత్రం నిరాశే ఎదురైంది. ఈ రెండు జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్‌లు గ్రూప్ దశలో మిగతా ఆరు జట్లతో పటిపడాల్సి ఉంటుంది.గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచినా నాలుగు జట్లు తర్వాత చోటు దక్కించుకుంటాయి. 2014లో చాంపియన్స్‌గా నిలిచిన శ్రీలంక నేరుగా సూపర్ 12 స్టేజ్‌కు అర్హత సాధించకపోవడంపై ఆ టీమ్ కెప్టెన్ లసిత్ మలింగ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాము సూపర్‌ 12 స్టేజ్‌కు అర్హత సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశాడు.

leave a reply