అయ్యో.. రామా..!

New Delhi: Prime Minister Narendra Modi at the silver jubilee celebration of National Human Right Commission, in New Delhi, Friday, Oct 12, 2018. (PTI Photo/Atul Yadav) (PTI10_12_2018_1000181B)

దేశవ్యాప్తంగా తెలంగాణాతోపాటు నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో మోడీ పరుగుకు అడ్డుకట్ట పడింది.రాష్ట్రాల్లోని పనితీరే ఈ ఎన్నికల్లో ఫలితాల మీద ప్రభావం చూపించింది. మోడీనిర్ణయాలే ఓటమికి దోహదపడ్డాయని చెప్పవచ్చు. ఒక్క మిజోరాం రాష్ట్రంలో తప్ప మిగిలినఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. మొదటినుంచీ రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. మధ్యప్రదేశ్‌లోమాత్రం కాంగ్రెస్‌, బీజేపీల మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది. కాగా.. మొత్తానికి మధ్యప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్‌ విజయం సాధించింది. బీజేపీ వైఫల్యాలే కాంగ్రెస్‌కుకలిసి వచ్చిందని చెప్పవచ్చు. మిజోరాంలో కూడా స్థానిక పార్టీనే కైవసం చేసుకోవడం బీజేపీకి తీవ్రమైన ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. తెలంగాణాలో రాష్ట్రంలో కూడా బీజేపీనిప్రజలు పట్టించుకోలేదని అర్థం చేసుకోవచ్చు.

కాగా.. మొత్తానికి ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో బీజేపీకి అన్ని స్థానిక ప్రాంతాల నుంచి వ్యతిరేకత అయితే ఉందని వ్యక్తంమవుతుంది. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ హంగ్‌గా ఏర్పడి బీజేపీ ప్రభుత్వానికి ఎదురుదాడికి దిగింది. ఇక ఏపీలో జరగబోయే ఎన్నికల్లో కూడా గొంతులో పడ్డ వెలక్కాయ పరిస్థితిలా ఉంది బీజేపీ పరిస్థితి. ఇక మిగతా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కూడా చూడాలి.. బీజేపీ నిలుస్తుందా..? ఓడుతుందా..?

leave a reply