రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు.. సన్నద్ధమైంది.

ప్రస్తుత ఫలితంతో రేవంత్  రాజకీయ భవిష్యత్ ఎలా  ఉంటుందో అని ఆసక్తి నెలకొంది.

తెలంగాణ: తెలంగాణలో పూర్తయిన ఎన్నికల ఓట్ల లెక్కింపు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఫలితాల్లో తెరాస పూర్తి  స్థాయిలో విజయదుందుభి మోగించింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 88 స్థానాలో తెరాస విజయఢంకా మోగించి రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమైంది. ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌ 19, తెదేపా 2, భాజపా 1, ఎంఐఎం 7, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు.

బాహుబలిగా భావించే రేవంత్ రెడ్డికి తెరాస చెక్ పెట్టింది పట్నం నరేందర్ రెడ్డిని అనూహ్యంగా బరిలోకి దించి కెసిఆర్,కెటిఅర్ మరియు హరీష్ స్వయంగా ప్రచారం చేసి వ్యూహ రచనలు అమలు చేసారు.కీలక నేతలకు ఓటర్లు ఊహించని షాక్‌ ఇచ్చారు. జానారెడ్డి, జీవన్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పరాజయం పాలయ్యారు. ఇదే సమయంలో మంత్రులు తుమ్మల, జూపల్లి కృష్ణారావు, చందూలాల్‌, మహేందర్‌ రెడ్డి సహా సభాపతి మధుసూదనాచారి ఓటమిపాలయ్యారు. సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మరోవైపు తెరాస శ్రేణులు సంబురాల్లో మునిగి తేలుతున్నాయి.ప్రస్తుత ఫలితంతో రేవంత్  రాజకీయ భవిష్యత్ ఎలా  ఉంటుందో  అని ఆసక్తి నెలకొంది.

leave a reply