అరె..! నన్నెవరు గుర్తించుకుంటారు..?

దేశంలోనే అసోంలో అతిపెద్ద పొడవైన రైలురోడ్డు వంతెనను మంగళవారం
ప్రధాని నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించారు. బోగిబీల్ వంతెన అని పిలిచే నిర్మాణానికి రూ.5,900 కోట్లు ఖర్చయ్యాయి. అసోం ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఆ వంతెన నిర్మాణంపై అంతటా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే.. 21 ఏళ్ల క్రితం ఈ వంతెనకు శంకుస్థాపన చేసిన అప్పటి మాజీ ప్రధాని దేవెగౌడను ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నన్నెవరు గుర్తు పెట్టుకుంటారు..?’ అని అసహనం ప్రకటించారు. అందుకూ కారణం ఉంది. ఆ వంతెనకు 1997లో తాను ప్రధానిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు

మరి ప్రారంభోత్సవానికి పిలిచారా? అని మీడియా అడిగితే అయ్యోరామా..! నన్నెవరు గుర్తుంచుకున్నారులే బాబూ అని నిట్టూర్పు విడిచారట. కశ్మీర్‌కు రైల్వేలైను, ఢిల్లీ మెట్రో, బోగిబీల్ వంతెన తానే మంజూరు చేశానని, మూడింటికి మొదటి విడుతగా వందేసి కోట్లు విడుదల చేశానని వివరించారు. నన్ను ఆహ్వానించకపోయినా కొన్ని పత్రికలు తన హయాంలో శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టు అని ప్రస్తావించానని పేర్కొన్నారు. అయినా అధికారంలో ఎవరుంటే వారి చేతే శంకుస్థాపన చేయిస్తారు. ప్రారంభోత్సవాలూ అంతే. ఆ మాత్రం తెలియకుండా ఆనాడు దేశప్రధాని ఎలా అయ్యారో ఏమో గౌడసాబ్?

కాగా.. మొత్తానికి 21 ఏళ్లకు ప్రధాని మోడీ హయాంలో వంతెన నిర్మాణం పూర్తి అయింది.

leave a reply