పెద్ద నోటు…ఇక రాదట!

పెద్ద నోట్ల రద్దు అనంతరం కేంద్రం ప్రవేశపెట్టిన రూ.2 వేల నోటు ముద్రను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆర్బీఐని కోరింది. అయితే పెద్ద నోట్లను వెనక్కి తీసుకోబోతున్న కేంద్రం అని గత కొంతకాలంగా వస్తున్న వార్తలకు కేంద్రం బలం చేకూర్చింది. పెద్ద నోట్ల వల్ల మనీలాండరింగ్ కేసులు పెరుగుతున్నట్టు గ్రహించిన కేంద్రం నోట్ల ముద్రణను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. 2016 లో కేంద్రం పాత  నోట్లను రద్దు చేస్తూ నవంబరులో చివర్లో ఈ నోట్లను  కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.

అయితే పెద్ద రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలను ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఖండించింది. కానీ, తాజాగా వాటి ముద్రణను నిలిపివేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రూ.2000  నోట్ల రద్దు అంటూ వస్తున్న వార్తలను ఎవరు నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే నోట్ల ముద్రణను నిలిపివేసిన నోట్లు మాత్రం చలామణిలోనే ఉంటాయని స్పష్టం చేసింది.

leave a reply