అలీ సినీ గ్లామర్…బలమేనా

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ వైసీపీ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం. ఇటీవల జగన్ ని  కలిసిన అలీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు.అయితే ఈనెల జనవరి 9న జగన్ పాదయాత్ర ముగియనున్న సందర్భంగా వైసీపీ ఏర్పాటు చేస్తున్న భారీ సభలో అలీ ఇచ్ఛాపురంలో వైసీపీ పార్టీలో చేరబోతున్నారు .

అయితే డిసెంబర్ 28న హైద్రాబాద్ లో  జగన్ ను  కలిసిన సందర్భంగా వైసీపీలో చేరాలనే కోరికను జగన్ కు తెలియచేసినట్లు సమాచారం.  అలీ రాజమండ్రికి చెందిన వ్యక్తి కావడంతో అక్కడి ప్రజలకు అయన దగ్గర అవుతారని భావిస్తున్నట్లు సమాచారం. అలీ సినీ గ్లామర్ పార్టీకి ప్లస్ అవుతుందని కొంతమంది ఆలోచన. అటు జగన్  ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అలీ సిద్ధమవుతున్నట్టు సమాచారం.

leave a reply