ఇక ఎప్పటికో..

ఇప్పటి వరకు అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. మరో నెల రోజుల పాటు వాయిదా పడనుంది. పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జనవరి 30 వరకు క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం లేదు. సంక్రాంతి తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అందరు భావించారు. ఏలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ పడింది.

అనేక కారణాలతో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ వాయిదా పడుతూ వస్తుంది. రెండవసారి టిఆర్ఏస్ పార్టీ ప్రభూత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. సీఎంతో పాటు మహమూద్ అలీ మాత్రమే హొంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వారంరోజుల పాటు కొనసాగింది. ఈ పర్యటనలో సీఏం కేసీఆర్ ఉన్నందున ఆ తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఢిల్లీ ఇతర రాష్ర్టాల పర్యటన ముగించుకొని వచ్చిన సీఏం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ మంచి రోజులు చూసుకొని క్యాబినెట్ విస్తరిస్తామని..అది కూడా సంక్రాంతి తర్వాతే అని తేల్చిచెప్పారు.

మంత్రి పదవులు ఆశించే నేతలు ఏలక్షన్ కోడ్‌తో మరి కొద్ది రోజులు ఆగక తప్పని పరిస్థితి ఏర్పడింది. మంత్రి వర్గ కూర్పు పై ఇప్పటికే అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రి వర్గంలో ఉండేది వీరేనంటూ నేతల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. క్యాబినెట్ విస్తరణ ఆలస్యమయ్యేకొద్ది ఈ వార్తలు సోషల్ మీడియాలో మరింత వైరలే అవకాశం ఉంది లేకపోలేదు.

కాగా.. కొత్తగా మంత్రి పదవులు ఆశించేవారు క్యాబినెట్ విస్తరణ కోసం కళ్ళు కాయలు కాసేలా ఏదురుచూస్తున్నారు.య ఏలక్షన్ కోడ్‌తో క్యాబినెట్ విస్తరణ వాయిదా పడడంతో సదరు నేతలు నిరుత్సాహానికి గురవుతున్నారట.. అయినా.. సీఏం కేసీఆర్ ఏం చేసినా అంతా మనమంచికే అంటు సంతృప్తి పడుతున్నారట టిఆర్ఏస్ నేతలు..

leave a reply