జగన్‌ వెళ్లగానే..

వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్ర శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏడు గ్రామాలకు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తులు వైసీపీ అధినేతను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబుకు పైపై హంగులు తప్ప ప్రజల హృదయాలు తెలీవన్నారు. ఇప్పటివరకూ కిడ్నీ బాధితులకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఎంతసేపూ సొంత డబ్బా కొట్టుకోవడమే తప్ప ప్రజల కష్టాలు ఏం తెలుసని ప్రశ్నించారు? నాలుగు సంవత్సరాలు రాసుకుపూసుకుని తిరిగారు.. ఏపీ విభజన హామీల్లో ఒక్క హామీని కూడా చేయించుకోలేని పరిస్థితి అన్నారు.

వైసీపీ అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితులకు నెలకు రూ.10వేల పెన్షన్‌ ఇస్తా అంటూ హామీ ఇచ్చారు. సరిపడ డయాలసిస్‌ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇచ్ఛాపురంలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసి.. వంశాధార నుంచి సురక్షిత నీరు అందిస్తామని అన్నారు.

leave a reply