కేంద్రం తగ్గలేదు

విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్ బరోడా విలీనానికి కేంద్రం ఆమోదం తెలిపినట్టు కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ మూడు కలిసి దేశంలోని మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనున్నాయి. విలీనం తర్వాత ఉద్యోగుల కోత ఉండదని మంత్రి స్పష్టం చేశారు. దేనా బ్యాంకు, విజయ బ్యాంకు ఉద్యోగులు బ్యాంక్ ఆఫ్ బరోడాకు బదిలీ అవుతారని పేర్కొన్నారు.

కాగా.. ఈ మూడింటి వ్యాపార లావాదేవీలు కలిపి రూ. 14.82 లక్షల కోట్లకు చేరుకోనుంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ తర్వాత మూడో అతిపెద్ద బ్యాంకుగా రికార్డులకు ఎక్కునుంది. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంక్‌ ఉద్యోగులు గత నెలలో ఆందోళనలు చేపట్టినా.. కేంద్రం వెనక్కి తగ్గలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ విలీనం అమల్లోకి రానుంది. అటు ప్రస్తుతం అమల్లో ఉన్న నేషనల్‌ హెల్త్‌ ఏజెన్సీ స్థానంలో నేషనల్‌ ఆధారిటీ ఏర్పాటుకు కేంద్రమంత్రి వర్గం అంగీకారం తెలిపింది.

leave a reply