ఐపీఎల్‌ పని ఒత్తిడిపై శాస్త్రి సమీక్ష!

త్వరలో ప్రపంచకప్‌ సమీపిస్తుండటంతో ఐపీఎల్‌ సీజన్లో ఆటగాళ్ల పనిభారాన్ని తగ్గించడానికి ప్రయత్నించాల్సి ఉంటుందని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. సాధ్యమైనంత వరకు టీమిండియా ఆటగాళ్లపై పని ఒత్తిడి పడకుండా ఎన్ని మ్యాచ్‌లు ఆడగలరో అన్నే ఆడించాలని ప్రాంఛైజీలకు సూచిస్తామన్నారు. ప్రస్తుత భారత జట్టు అద్భుత ఫామ్ లో ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్న టీమిండియా  సిరీస్ అనంతరం తిరిగి త్వరలో భారత్‌కు రానుంది. వెంటనే ఆస్ట్రేలియాలో ఐదు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత ఆటగాళ్లందరూ ఐపీఎల్‌లో పాల్గొంటారు. తరువాత పది రోజుల వ్యవధిలోనే మే చివరి వారంలో ప్రపంచకప్‌ మొదలవనుంది.

ఆటగాళ్లఫై ఒత్తిడి తగ్గించేందుకు ఐపీఎల్‌ సమయంలో సంబంధిత సారథులు, ప్రాంఛైజీలతో మేం మాట్లాడతాం. ప్రపంచకప్‌ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, ఫామ్‌పై ఎటువంటి ప్రభావం పడకుండా మ్యాచ్‌లు ఆడించడానికి ప్రయత్నిస్తాం. ప్రపంచకప్‌కు ఇప్పుడున్న తీరికలేని షెడ్యూల్ వల్ల ఆటగాళ్లకు సరైన విశ్రాంతి అవసరం. ఐపీఎల్‌ తర్వాత కేవలం 10 రోజుల సమయమే ఉన్నందువల్ల కొన్ని కీలక అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఐపీఎల్‌ సమయంలో పనిభారం, ఫిట్‌నెస్‌, నైపుణ్యాలను సమీక్షించాలి’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

leave a reply