కన్ను భాగం పడిన కారణంగా

శక్తిపీఠాలు.. అది ప్రాచీనమైన, శక్తి గల ఆలయాలుగా గుర్తింపు పొందినవి. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే ముఖ్యంగా హిందువులు 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలుగా కొలుస్తూ ఉంటారు.

వాటిల్లో ఒకటిగా చెప్పబడుతుందే ఈ నైనితాల్‌ శక్తి పీఠం. పార్వతీ దేవి(సతీదేవి) దేహభాగంలో ఒక భాగమైన కన్ను ఇక్కడ పడిందని, అది సరస్సుగా మారిందని పురణాలు చెప్తున్నాయి. ఈ ఆలయం హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిల్సాపూర్‌ ప్రాంతలో నైనితాల్‌ సరస్సు ఒడ్డున ఉంది. అమ్మవారు కన్ను భాగం ఇక్కడ పడిన కారణంగా ఇక్కడి భక్తులు అమ్మవారిని నయనాదేవిగా కొలుస్తూ ఉన్నారు. ఈ ఆలయంలో అమ్మవారు మొఖము ఒకటే దర్శనమిస్తూ ఉంటుంది. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన ఆచార వ్యవహరాలు ఉంటాయి. అక్కడి భక్తులు ఆ దైవాన్ని వ్యవహరించే తీరు వివిధ రకాలుగా ఉంటాయి. అలాగే.. ఇక్కడ కూడా భక్తులు కోరిన కోర్కెలు అమ్మవారు నెరవేర్చితే బంగారం లేదా వెండి రూపంలో నేత్రాలను చేసి అమ్మవారికి బహుకరిస్తూ ఉండటం ఇక్కడ ఆచారం.

ఇక చాలామంది భక్తులు తమ మనసులోని కోరికను అమ్మవారికి చెప్పుకుని అది నెరవేరడం కోసం, అమ్మవారి మందిరానికి ఎదురుగా గల చెట్టుకి ‘ఎర్రని వస్త్రం’ కడుతుంటారు. తరతరాలుగా ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతోంది. ఇలా అమ్మవారికి ఎదురుగా గల ఈ చెట్టుకి ఎర్రని వస్త్రాన్ని కట్టడం వలన మనోభీష్టం తప్పక నెరవేరుతుందని అంటారు. అమ్మవారి సన్నిధిలో గల చెట్టుకి ఎర్రని వస్త్రాన్ని సమర్పించే భక్తుల సంఖ్యను చూస్తే, అమ్మవారి పట్ల, ఆచారం పట్ల వారికి గల విశ్వాసం ఎంత బలమైనదనే విషయం స్పష్టమవుతుంది.

leave a reply