మహిళల ప్రయత్నం.. అడ్డుకున్న భక్తులు

కేరళలోని పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అయ్యప్ప దర్శనం కోసం ఆదివారం 11 మంది మహిళలు ప్రయత్నించగా.. భక్తుల ఆందోళనలతో పోలీసులు వారిని బలవంతంగా వెనక్కి పంపిన విషయం తెలిసిందే. అయితే.. సోమవారం తాజాగా మరో ఇద్దరు 50 ఏళ్ల లోపు మహిళా భక్తులు అయ్యప్ప దర్శనానికి బయల్దేరారు. మలప్పురానికి చెందిన బిందు, కోజికొడ్‌ ప్రాంతానికి చెందిన దుర్గ, అయ్యప్ప దర్శనానికి బయల్దేరారు. తొలుత అప్పచిమేడు వద్ద వీరిని అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని నిలువరించి బిందు, దుర్గను భారీ భద్రత మధ్య ముందుకు తీసుకెళ్లారు. అయ్యప్ప సన్నిధానాన్ని చేరుకునే సంప్రదాయ అటవీ మార్గంలో పంబ నుంచి నడక ప్రారంభించి సన్నిధానానికి కిలోమీటరు దూరంలో ఉన్న మారకూటం చేరుకున్నారు. అక్కడ కూడా అయ్యప్ప భక్తులు వీరిని అడ్డుకోగా.. పోలీసులు వారిని వెనక్కి పంపించారు. కాగా.. బిందు, దుర్గ ఇంటి ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

leave a reply