ముందస్తుగా అప్రమత్తం అయ్యాం…

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పెథాయ్‌ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం ముందస్తు జాగ్రత్త చర్యలతోనే తుఫాను నష్ట తీవ్రతను తగ్గించగలిగామని అన్నారు. వాతావరణశాఖ హెచ్చరికతో ఐవీఆర్‌ఎస్‌, ఆర్టీజీఎస్‌ ద్వారా అందరికీ సందేశాలు పంపామన్నారు.

కాగా.. తప్పకుండా నష్టపోయిన వారికి ఆర్థిక సహకారం అందిస్తామని అన్నారు. ఎన్ని తుఫానులు వచ్చిన టీడీపీ పటిష్ఠంగా ఎదుర్కొంటుంది అన్నారు. అనవసరంగా మాట్లాడేవారి మాటలు నేను పట్టించుకోనని అన్నారు. ఇంతకు ముందు ఖచ్చిమైన సమాచారం దొరకక నష్టపోయేవాళ్లం. కాని అత్యధునిక టెక్నాలిజీ తుఫాన్‌ ప్రభావాన్ని గుర్తించవచ్చు అన్నారు. విద్యుత్‌ సరఫరాకై జనరేటర్లను, వాటర్‌ ట్యాంకులను సమయాలానుకూలంగా ఉపయోగించామన్నారు. తిత్లీ బాధితులకే ఇప్పటివరకూ సహాయం అందించని కేంద్రం ఇక పెథాయ్‌ తుఫాను బాధితులకు సహాయం అందిస్తుంది అని ఆశ పడటం అత్యాశేనన్నారు. కేంద్రంకు తెలుగు ప్రజలను ఏ మాత్రం పట్టించుకోరనన్నారు. ముందస్తుగా అన్ని ప్రాంతాల్లో భద్రతా చర్యలు ఏర్పాటు చేశామన్నారు సీఎం చంద్రబాబు.

అక్టోబర్‌, డిసెంబరు నెలల్లో తుపానులు వస్తున్నాయని.. వాటి బారిన పడకుండా ఉండేందుకు వీలుగా తొలి పంట నవంబర్‌లోపే చేతికందేలా రైతులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. పెథాయ్‌ తుపాను ప్రభావంతో విశాఖ జిల్లా అరకు ప్రాంతంలో అత్యధికంగా23 సె.మీ, తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో సుమారు 17 సె.మీ వర్షపాతం నమోదైందని చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో 80-85 కి.మీ వేగంతో గాలులు వీచాయని.. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు బాగా పడ్డాయని చెప్పారు.  25 సెల్‌టవర్లు పాడైతే వాటిని యథాస్థితికి చేర్చారని, దెబ్బతిన్న రోడ్లను గంటల వ్యవధిలోనే అధికారులు పునరుద్ధరించారని చంద్రబాబు వివరించారు.

అలాగే.. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానమిస్తూ.. తనకు ప్రధాని పదవిపై ఎలాంటి ఆశ లేదని పునరుద్ఘాటించారు. రానున్నకాలంలో దేశ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని, దానికి సంకేతమే మూడు రాష్ట్రాల్లో భాజపా ఓటమి అని చెప్పారు. వైకాపా పైనా, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌పైనా విమర్శలు గుప్పించారు. పక్క జిల్లాలోనే ఉంటూ తిత్లీ బాధితులను పరామర్శించని వ్యక్తి.. తనను విమర్శించడమేంటని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

leave a reply