ఏపీకి కేంద్రం…మరో షాక్!

విశాఖ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఎయిర్‌ షోను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టేలా విశాఖ ఉత్సవ్ పేరుతో ఏటా ఏపీ ప్రభుత్వం వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ సిద్ధమయింది. విశాఖ తీరంలో 9 యుద్ద విమానాలతో 90 మంది నావికా సిబ్బందితో ఏర్పాటు చేయాలనుకున్న ఎయిర్ షోకు కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో ప్రదర్శనను రద్దు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

కొద్దీ రోజులముందే నిర్వాహకులు విశాఖపట్నం వచ్చి ఆర్కే బీచ్‌, ఇతర ప్రాంతాలను ,నిర్వహణ ఏర్పాట్లను చూసి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరుతూ రక్షణ శాఖకు కూడా లేఖ పంపారు అయితే అప్పటికే సమయం మించి పోవడంతో కేంద్రం అనుమతి నిరాకరించినట్లు చెప్పారు. అయితే ఏపీపై చిన్నచూపుతోనే కేంద్రం వ్యవహరిస్తోందనీ, అందుకే వాయుసేన సిబ్బందిని రిహార్సల్స్ పూర్తి చేశాక వెనక్కు పిలిపించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. సిబ్బంది విశాఖ ఉత్సవ్ లో పాల్గొనకుండా వెళ్లిపోవడానికి కేంద్రమే కారణమని మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఆరోపించారు.

leave a reply