ఐదు రోజులు మాత్రమే దర్శనం

సలేశ్వరం ఇది శ్రీశైలంలోని ఒక యత్రా స్థలము. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం. చారిత్రక ప్రాముఖ్యత గల ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తొలి పౌర్ణమికి మొదలవుతుంది. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి ఉంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు.

చరిత్ర ప్రకారం.. శ్రీశైలంలోని అందాలకు ముగ్దుడైన నిజాం అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. ఆ ప్రదేశానికి ఫరాహబాద్ అనిపేరు. నిజాం 22 కిలోమీటర్ల దూరంలోనే సలేశ్వరం ఆలయం ఉంటుంది. అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి. అక్కడ రెండు పొడవైన ఎత్తైన రెండు గుట్టలు ఒకదాని కొకటి సమాంతరంగా వుంటాయి. తూర్పు కొండకు దగ్గరగా వెళ్తే మధ్యలో ఒక లోతైన లోయ లోనికి ఆ జలధార పడుతుంది. ఇరుకైన లోయలో బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితే ఇక కైలాసానికే. వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిదని భక్తులు నమ్ముతారు. స్థానికంగా ఉన్న చెంచులే ఇక్కడ పూజారులు. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి.

సలేశ్వరం యాత్ర చాలా కష్టతరమైనదిగా చెప్తూ ఉంటారు. అడవుల్లో, కొండల్లో నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అడవి కాబట్టి క్రూరమృగాలు, పెద్ద పెద్ద అనకొండలు దర్శనమవుతూ ఉంటాయి. అందుకే రెండు సంవత్సరాలకొకసారి ఈ జాతరను నిర్వహించి ఐదురోజులు మాత్రమే దర్శనానికి అనుమతినిస్తారు. కొంత మంది భక్తులు ఇక్కడ ఉచితంగా అన్నసమారాధనలు ఏర్పాటు చేసి భక్తులకు సహాయం అందిస్తారు.

leave a reply