కోడిగుడ్లు ఇలా కూడా ఉపయోగమే!

రోజుకొక కోడిగుడ్డు తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమని చెబుతుంటారు. అయితే ఇలా రోజుకో గుడ్డు తినడం మంచిదనే విషయంలో నిజం లేకపోలేదుగానీ, త్వరలోనే కోడిగుడ్లతో మానవునికి ఇంకో మేలు చేకూరనుంది. కొన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మందులను కూడా ప్రొటీన్ల రూపంలో కోడి గుడ్ల నుంచి తయారుచేయవచ్చని ఎడిన్‌బరో యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల కారణంగా వెలుగు చూసింది.

మానవ ప్రొటీన్లను మందులుగా చాలాకాలంగా ఉపయోగిస్తున్నప్పటికీ, కానీ.. వాటిని కృత్రిమంగా ఉత్పత్తి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నవ్యవహారం. ఈ నేపథ్యంలో ఎడిన్‌బరో శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి చేసిన కోళ్ల ద్వారా మానవ ప్రొటీన్లు ఉన్న కోడిగుడ్లను ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు ప్రారంభించారు. అయితే కోడిగుడ్లలోకి చేరిన మానవ ప్రొటీన్లు అచ్చం మనిషిలోని ప్రొటీన్ల తీరును కనబరుస్తూండటంతో … ఈ పని సులువవుతుందని, ఈ పద్ధతి ద్వారా ఈ ప్రొటీన్లను  వాడుకోవచ్చునని కోడిగుడ్లను వాడటం వల్ల ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతానికి ఈ ప్రొటీన్లను మానవులలో ఉపయోగించే పరిస్థితి లేదని, భవిష్యత్తులోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.  

leave a reply