వావ్‌.. వారానికి మూడు రోజులు..

వావ్‌.. వారానికి 3 వీకెండ్స్‌.. ఈ మాట వినగానే చాలా సంతోషంగా అనిపించింది కదా.. విదేశాల్లో, అలాగే స్వదేశంలోని అనేక ప్రైవేటు టెక్, బిజినెస్ కంపెనీలు వారానికి 5 రోజుల పని పద్ధతి పాటించడం తెలిసిందే. శని, ఆదివారాలు వీకెండ్ ఎంజాయ్ అంటు సెలవు తీసుకుంటారు. ఇప్పుడు వారానికి 4 రోజల పనిదినాలు రాబోతున్నాయి. జీతం తగ్గకుండా వారానికి ఓ రోజు అదనపు సెలవుదినం లభిస్తే ఎవరికైనా సంతోషమే. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కంపెనీలు ఇది బాగానే పనిచేస్తున్నదని అంటున్నాయి. అమెరికా, బ్రిటన్‌తో సహా 8 దేశాల్లోని 3 వేలమంది ఉద్యోగులపై ఈ జరిపిన అధ్యయనంలో నేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుందని, సిబ్బందిలో మరింత ఉత్సాహం కలుగుతుందని, అలసట తగ్గిపోతుందని పరిశీలనలో తేలిందని చెప్తున్నాయి.

కాగా.. ఇది చాలా ఆరోగ్యకరమైన విధానమని, దీనివల్ల పనితీరు ఎంతో మెరుగుపడుతుందని ప్లేనియో కంపెనీ వ్యవస్థాపకుడు జాన్ షుల్జ్-హాఫెన్ తెలిపారు. ఆయన తన కంపెనీలో 4 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలో సిబ్బందిలో వత్తిడి తగ్గిపోయి, ఉత్సాహం ఇనుమడించినట్టు పర్పెచువల్ గార్డియన్ అనే న్యూజీల్యాండ్ కంపెనీ తెలిపింది. పని అంటే పడిచచ్చే జపాన్‌లోనూ సోమవారం ఉదయం షిఫ్టులకు ముగింపు పలుకుతున్నారు. మొత్తంమీద ఈ మార్పు పనికి, కుటుంబ జీవితానికి మధ్య సమతూకం సాధించేందుకు సిబ్బందికి తోడ్పడతుందని పరిశీలకులు అంటున్నారు. అంతేకాకుండా తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేయగలుగుతున్నారని అధ్యయనంలో తేలడం విశేషం.

leave a reply