తమన్నాకి.. కొణిదెల వారి గిప్ట్‌..!

ఈ రోజు మిల్కీ బ్యూటీ బర్త్‌డే. మిల్కీ బ్యూటీ అంటే అర్థమయ్యిందా..! ఇంకెవరు.. తమన్నా. ఈరోజు తమన్నా బర్త్‌డే.. సో.. తను నటిస్తున్న సైరా నర్సింహారెడ్డి మూవీ టీం తనకు బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చింది. అదేంటంటారా..! సైరాలో తమన్నా లుక్‌ను, మోషన్‌ టీజర్‌ను విడుదల చేసింది. ఈ లుక్‌లో తమన్నా యువరాణిలా చాలా అందంగా కనిస్తుంది. కాగా.. ఇందులో ఆమె పాత్ర గురించిన వివరాలను మాత్రం చిత్రబృందం ప్రకటించలేదు. ఇక.. ఈ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు.

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో నరసింహారెడ్డి సతీమణి సిద్ధమ్మగా నయనతార నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, బ్రహ్మాజీ, హుమా ఖురేషీ, నాజర్‌ తదితరులు సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. 2019లో సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

leave a reply