న్యూయర్‌కి నాని న్యూ మూవీ పోస్టర్‌..

న్యూయర్‌ సందర్భంగా `జెర్సీ’ సినిమా పోస్టర్‌ లాంచ్‌ చేయగా.. నాని హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా క్రికెట్  నేపథ్యంలో కొనసాగగా.. నాని ఇందులో క్రికెటర్‌గా కనిపించనున్నాడు. క్రికెటర్ లుక్‌తో నాని ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాకు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్‌ కనిపించనుంది. నానికి కొంతకాలంగా సరైన హిట్ లేదు. దాంతో కొత్త సంవత్సరంలో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో నాని ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్నట్లు తెలిపారు. తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో వున్నాడు. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సినిమా వర్గం నుంచి సమాచారం.

leave a reply