ప్రజల ముందుకు లగడపాటి సర్వే .

గతంలో కంటే ఎక్కువ పోలింగ్‌ జరిగితే కూటమికి అనుకూలం.

ఎన్నికల ఫలితాలను ముందుగానే  అంచనా వేయడంలో సాటిలేని  లగడపాటి రాజగోపాల్ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిరేపుతూ ఎన్నో  విషయాలు  చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం ప్రజానాడి కాంగ్రెస్‌ వైపు ఉందని  గతంలో కంటే ఎక్కువ పోలింగ్‌ జరిగితే కూటమికి అనుకూలం. గతంలో కంటే భాజపాకు సీట్లు పెరుగుతాయి. జిల్లాల్లో కూడా సీట్లు వస్తాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యం ఉంది. వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో తెరాసకు ఆధిక్యం ఉంది. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లో పోటాపోటీ ఉంటుంది. హైదరాబాద్‌లో ఎక్కువ ఎంఐఎం, తర్వాత భాజపా, తెరాస, కాంగ్రెస్‌ గెలుస్తాయి.

ప్రస్తుతం ప్రజానాడి కాంగ్రెస్‌ వైపు ఉంది. గతంలో కంటే ఎక్కువ పోలింగ్‌ జరిగితే కూటమికి అనుకూలం. గతంలో కంటే భాజపాకు సీట్లు పెరుగుతాయి. జిల్లాల్లో కూడా సీట్లు వస్తాయి. ఇటీవల ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. గెలిచే అభ్యర్థుల పేర్లను ఇలా రోజుకో రెండు చొప్పున ప్రకటిస్తానని చెప్పినప్పటికి అనుకోని  కారణాల వల్ల ఆయన మీడియా ముందుకు రాలేదు. అయితే ప్రచారం గడువు రేపటితో ముగియనుండడంతో.. నేడు మీడియా ముందుకు వచ్చి సర్వేలోని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా మరో ముగ్గురి పేర్లు చెప్పారు.  మరో మూడు నియోజకవర్గాల్లో తన సన్నిహితులు పోటీ చేస్తున్నారని.. వారి అభ్యర్థన మేరకు ఆ మూడు స్థానాల గురించి చెప్పడం లేదన్నారు. తన సర్వే ఎప్పుడూ ఏ ఒక్క  పార్టీకి  అనుకూలంగా  ఉండదని    చెప్పుకొచ్చారు. అదే విధంగా ఏఏ జిల్లాల్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందో..ప్రస్తుత ప్రజానాడి ప్రకారం ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో కూడా లగడపాటి మీడియాకి తెలియజేశారు.

leave a reply