మాల్యా.. 14 రోజులు మాత్రమే..

బ్యాంకులకు కోట్లాది రుపాయలు ఎగ్గొట్గి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు యూకే కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మ్యాలాను భారత్‌‌కు అప్పగించాలన్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అభ్యర్థనను లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు సమర్థించింది. విజయ్ మాల్యాను వెంటనే భారత్‌కు అప్పగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక తీర్పుపై 14 రోజుల్లోగా అప్పీలు చేసుకునే అవకాశాన్ని మాల్యాకు న్యాయస్థానం కల్పించింది.

ఇక  ఈ కేసు విచారణకు భారత్ తరుఫున సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఎస్ సాయి మనోహర్ హాజరయ్యారు. వివిధ బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మోసం చేసిన ఆరోపణలతో మాల్యాపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద పలు కేసులు నమోదయ్యాయి. మార్చి 2016లో లండన్‌కు పారిపోయిన మాల్యాకు వ్యతిరేకంగా సీబీఐ లుక్ అవుట్ నోటీసును జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా గతేడాది ఏప్రిల్‌లో అరెస్ట్ అయిన మాల్యా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

leave a reply