వైరల్‌ అవుతున్నకల్కి..మోషన్‌ పోస్టర్‌!

యాంగ్రీ యంగ్‌మెన్‌గా రాజశేఖర్ ఎన్నో హిట్ సినీమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే సుదీర్ఘ కాలంగా విజయాలు లేని రాజశేఖర్  ‘గరుడవేగ’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించటంతో రాజశేఖర్‌ మళ్లీ గదిలో పడ్డాడని అందరూ భావిస్తున్నారు. అయితే గరుడవేగ రిలీజై చాలా రోజులు గడుస్తున్నా అయన చిత్రం  మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు.  తాజాగా “అ!” చిత్రంతో ప్రశాంత్‌ వర్మ తన  మొదటి ప్రయత్నంలోనే మంచి ప్రతిభ ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కినా అన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రం చేరువకాలేకపోయింది.  రాజశేఖర్‌ హీరోగా కల్కి సినిమాను తన తదుపరి ప్రాజెక్ట్‌గా ఎంచుకున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

క్రైమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయింది. ఈ చిత్రానికి శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతాన్ని అందించగా, ఆదా శర్మా, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివానీ శివాత్మిక మూవీస్‌ బ్యానర్‌ సమర్పణలో హ్యాపీ మూవీస్‌ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్‌ నిర్మాతలుగా పనిచేస్తున్నారు. 

leave a reply