పంచాయితీ ఎన్నికలకు రిజర్వేషన్‌ షురూ..!

వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్రంలో జరగునున్న పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్‌లను ఖరారు చేసింది. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆ వివరాలను ఎన్నికల సంఘానికి పంపింది.

రిజర్వేషన్లు వివరాలు ఇవే:

•             ఎస్సీలకు – 2,113 గ్రామపంచాయతీలు

•             షెడ్యూల్ ఏరియాలోని ఎస్టీలకు – 1,281

•             వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలు – 1,177

•             మిగిలిన గ్రామ పంచాయతీలలో ఎస్టీలకు – 688

•             బీసీలకు – 2,345

•             జనరల్ – 5,147

వీటిలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కేటాయించింది. 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలన్నింటినీ ఎస్టీ రిజర్వుడుగా పేర్కొంది.

leave a reply