39సంవత్సరాల రికార్డు…బుమ్రా పేరిట!

టీమిండియాతో జరుగుతున్నమూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 151 పరుగులకే కుప్పకూలింది. 8/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ టీమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా దాటికి ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ క్యూ కట్టారు. దీంతో భారత్‌కు 292 పరుగుల ఆధిక్యం లభించింది. జాస్ప్రీత్ బుమ్రా ఏ దశలోనూ ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్‌ను కోలుకోనివ్వలేదు. ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లు పరుగులు సాధించడానికి చాలా ఇబ్బంది పడ్డారు.వారు సాధించిన పరుగులలో అత్యధిక స్కోర్‌ 22 అంటే టీమిండియా బౌలర్లు ఏస్థాయిలో విరుచుకు పడ్డారోచెప్పక్కర్లేదు. ఈ ఇన్నింగ్స్‌లో బుమ్రా ఆరు వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. బౌలర్లలో జడేజా రెండు వికెట్లు, ఇషాంత్‌, షమీ చెరొక వికెట్‌ తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 292 పరుగుల ఆధిక్యం లభించింది.

టీమిండియాకు పేస్ బౌలింగ్ ఇబ్బందులు ఉన్నాయన్న భావం పూర్తిగా తొలిగిపోయింది. ఆసీస్ తో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో భారత బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 39 ఏళ్ల రికార్డును అధిగమించాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. టీమిండియా మాజీ క్రికెటర్‌ దిలీప్‌ జోషి రికార్డును అధిగమించాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనతో టెస్టులోకి అరంగ్రేటం చేసిన బుమ్రా ఇప్పటి వరకు 44 వికెట్లు తీశాడు. టెస్టుల్లోకి ప్రవేశించిన ఏడాదిలోనే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా దిలీప్‌ జోషి పేరిట ఈ రికార్డు ఉంది. 1979లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన దిలీప్.. అప్పట్లో 40 వికెట్లు సాధించాడు.

leave a reply