జంక్‌ఫుడ్‌తో ప్రమాదమే!

ప్రస్తుత కాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కేకులు..పిజ్జా బర్గర్లు అంటూ ఎక్కుగా తినేస్తున్నారు.. అయితే ఇలాంటి జంక్ ఫుడ్ తీసుకోవడం వలన ప్రమాదం అంటున్నారు. జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు పరిశోధకులు. ఈ జంక్‌ఫుడ్‌ శరీరానికే కాకుండా మనసుకూ చేటు చేస్తుందంటున్నారు మాంఛెస్టర్‌ మెట్రోపాలిటన్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కొలెస్ట్రాల్, పిండిపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వలన డిప్రెషన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

దాదాపు పదహారేళ్ల నుంచి 72 సంవత్సరాల వయసున్న లక్ష మందిపై జరిగిన పదకొండు అధ్యయనాల ఫలితాల ద్వారా ఈ అంచనాకు వచ్చినట్లు అధ్యయనకారులు తెలిపర్రు. డిప్రెషన్‌తో బాధపడే వారి ఆహారపు అలవాట్లను సేకరించి.. అవి శరీరంలో మంట, వాపు కలిగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించమన్నారు. డిప్రెషన్‌కు ఆహారం ఆధారంగా కొత్త చికిత్సా పద్ధతులను అభివద్ధి చేసేందుకు ఈ పరిశోధన తోడ్పడుతుందని తెలిపారు.

leave a reply