ఆలస్యంగా నిద్ర పోతున్నారా?

రాత్రి వేళలో పని చేసుకుంటూ సమయానికి నిద్రపోకుండా ఆలస్యం చేయడం ఉదయాన్నే నిద్ర లేవకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలియచేస్తున్నారు. త్వరగా నిద్రపోయి, సూర్యోదయం కాకముందే నిద్రలేవాలని పెద్దవాళ్లు చేప్పేవారు వారు ఊరికే చెప్పలేదు. దానివల్ల ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటామట. తాజాగా పరిశోధకులు చేసిన అధ్యయనంలో రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచే వాళ్ల కంటే ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా లేచే వాళ్ల మెదడు పనితీరులో తేడాలు ఉంటాయని పరిశోధనలలో తెలిసింది.

ఆలస్యంగా నిద్రపోయే  వాళ్ల మెదడు మందగించి, రోజూవారీ పనుల్లో కొన్ని అవరోధాలు ఏర్పడే ప్రమాదం ఉందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ సర్రే శాస్త్రవేత్తలు తెలియచేసారు. వాళ్ళు  చేసే పనుల్లో చురుకుతనం తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. అంతేకాకుండా సూర్యోదయమం  సమయంలో నిద్రపోవడం వలన D-విటమిన్ లోపించం జరుగుతుందని తెలిపారు.

leave a reply