ఇంగ్లండ్ టూర్లో విఫలమైన టీమిండియా ఈ సారి ఆస్ట్రేలియాతో రేపటి నుంచి మొదలు కాబోయే టెస్ట్ సిరీస్ లో మొదటి టెస్టును విజయంతో ప్రారంభించాలని చూస్తోంది. భారత జట్టు టెస్టుల్లో ఇప్పుడు నెంబర్‌వన్ స్థానాన్ని స్తుస్థిరంగా ఉంచుకుంది , కానీ ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టుల సిరీ్‌సను చేజిక్కించుకోవడం అంటే అది అంత సులువు కాదు , ఎందుకంటే అక్కడ పిచ్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి గత ప్రదర్శన ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఒక్క టీమిండియానే కాకుండా అన్ని అంతర్జాతీయ టీమ్స్ కూడా ఆసీస్‌లో ఆడటానికి ఇబ్బంది పడుతుంటాయి .కానీ టీంఇండీయా సారధి విరాట్ కోహ్లీ జట్టును గెలిపించడంలో ముందుంటాడు.
అటు ఆస్ట్రేలియా జట్టు ఆల్‌రౌండర్ ఆటగాడు మిచెల్ మార్ష్ ఆటతీరు సరిగా లేకపోవడంతో, అతని స్థానంలో దేశవాలి క్రికెట్లో అద్భుతంగా రాణించిన హాండ్స్‌కోంబ్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ పైన్ తెలిపాడు. మరోవైపు ఓపెనర్ ఫించ్‌కు జోడీగా అరంగేట్ర ఆటగాడు హారిస్‌ను సీఏ ఎంపిక చేసింది. కానీ ఈసారి ఆస్ట్రేలియా కంటే టీమిండియాకి పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా జట్టులో సూపర్స్టార్లు స్మిత్, వార్నర్ లేకపోవడం అదీగాకుండా ఆసీస్ ఇప్పుడు ఐదో ర్యాంకులో ఉండడ మే కాకుండా సమష్టి ఆటతీరును చూపడంలో విఫలమవుతోంది.
ఆస్ట్రేలియాతో టీమిండియాకు టెస్ట్ సిరీస్ రేపటి నుంచి.
టెస్ట్ సిరీస్ లో మొదటి టెస్టును విజయంతో ప్రారంభించాలని చూస్తోంది.
