గాడిదపై కూర్చొని.. రిపోర్టింగ్‌!

ఆయనకు న్యూస్రిపోర్టింగ్ చేయడమంటే ఓ పాషన్. అందుకే అందరిలా కాకుండా.. వెరైటీగా రిపోర్టింగ్ చేస్తూ  వార్తల్లో నిలిచాడు. ఆయన పేరు అమిన్ హఫీజ్. పాకిస్థాన్‌కు చెందినజర్నలిస్ట్. పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్ అనే ఓ చానెల్‌లో రిపోర్టర్‌గా  పనిచేస్తున్నాడు. ఆయన రిపోర్టింగే తేడాగా ఉంటుంది. ఎక్కడెక్కడో రిపోర్టింగ్ చేస్తుంటారు . జంతువులను ఇంటర్వ్యూ చేయడం… వర్షంలో తడుస్తూ రిపోర్టింగ్ఇవ్వడం..ఇదివరకు ఇటువంటి విచిత్ర ప్రయత్నాలు ఎన్నో చేశాడు. తాజాగా ఏకంగా గాడిద మీద కూర్చొని రిపోర్టింగ్ చేశాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గామారింది.

 లాహోర్‌లో గాడిదల బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రపంచంలోనే ఎక్కువ గాడిదలుఉన్న ప్రాంతంగా లాహోర్ చరిత్రకెక్కింది. దీంతో వాటి కోసం పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వాటికి ప్రత్యేకంగా ఆసుపత్రులు, వాటికి ఉచితంగా వైద్య సదుపాయం ఇస్తోంది. రోజుకు ఒక్క గాడిద 1000 పాకిస్థాన్ రూపాయలను సంపాదిస్తుందట. దీనిపై రిపోర్టింగ్ కోసం అమిన్ ఆ ప్రాంతానికి వెళ్లాడు.రిపోర్టర్ అనగానే అందరూ చుట్టుముడతారు కదా. అక్కడున్న గాడిదల్లో ఓ గాడిదనుసెలెక్ట్ చేసుకొని దాని మీదికి ఎక్కాడు. రిపోర్టింగ్ స్టార్ట్ చేశాడు. మనుషులకు,గాడిదలకు మధ్య ఉన్నసంబంధం ఇప్పటిది కాదని.. అది ఎప్పటి నుంచో ఉందని చెబుతూ… ఒక్కసారిగా లాహోర్‌లో గాడిదల బిజినెస్ పెరిగిందని.. దీంతో గాడిదల పెంపకందారులు, యజమానులు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పాడు.

లాహోర్‌లో గాడిదల బిజినెస్ బాగానే ఉంది కానీ.. నా ఫ్రెండ్ చూడండి.. గాడిదపై కూర్చొని తన లైఫ్‌నురిస్క్‌లో పెట్టి మరీ.. గాడిదల బిజినెస్ గురించి రిపోర్ట్ చేస్తున్నాడంటూ క్యాప్సన్ పెట్టాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆ జర్నలిస్టుపై సెటైర్ వేయడం ప్రారంభించారు. కొంతమంది మాత్రం మనోడియూనిక్ స్టయిల్ రిపోర్టింగ్‌ను తెగ మెచ్చుకుంటున్నారు.

leave a reply