తెరాసను గెలిపిస్తే కాళేశ్వరం.. కూటమిని గెలిపిస్తే శనీశ్వరం.

తెలంగాణలో జరిగినఎన్నికలు యావత్‌ దేశానికి ఓ మార్గాన్ని చూపాయని వ్యాఖ్యానించారు.

తెలంగాణ  శాసనసభ ఎన్నికల్లో తమకు ఈ గొప్ప విజయం అందించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు తెరాస ప్రభంజనానికి తెలంగాణ ప్రజలు ఎంతగానో సహకరించారని, ఈ ఎన్నికల్లో తమకు లభించిన ఘన విజయం ప్రజలదేనని ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీలు.. కులాలు, మతాలకతీతంగా  దీవించి తమకు ఈ  విజయాన్ని అందించారన్నారు.తెరాస కార్యకర్తలు, నాయకులు శ్రేణులందరూ అహోరాత్రులు కష్టపడి పనిచేయడం వల్లే గొప్ప విజయం సాధించగలిగాం అని  అన్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి కొత్త  రాష్ట్రాన్ని ఓ రీతిలో  తీర్చిదిద్దామ్ . దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కోటి ఎకరాలు పచ్చాగాఉండాలనే  లక్ష్యంలో ముందుకు వెళ్తామన్నారు. అది జరిగి తీరాల్సిందే. తెరాసను గెలిపిస్తే కాళేశ్వరం.. కూటమిని గెలిపిస్తే శనీశ్వరం అని ఎన్నికల ప్రచార సభల్లో అన్నాను. ఏది కావాలో తేల్చుకోవాలని ప్రజలకు చెప్పాను. కచ్చితంగా తమకు కాళేశ్వరం కావాలనే ప్రజలు తీర్పు ఇచ్చారు. దాంతో పాటు మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరు తెచ్చి తీరుతాం. ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాం.’తెలంగాణలో జరిగిన ఎన్నికలు యావత్‌ దేశానికి ఓ మార్గాన్ని చూపాయని వ్యాఖ్యానించారు.అంతేయ్ కాకుండా జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తామన్నారు. తాను ఎన్నికల బహిరంగ సభల్లో చెప్పినట్టుగానే కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు.

జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఓ దిక్సూచి తెలంగాణ. దేశంలో పెద్ద గందరగోళం ఉంది. వంద  శాతం భాజపాయేతర, కాంగ్రెసేతర పరిపాలన రావాలి. మాకు ఎవరూ బాస్‌లు లేరు. మేం ఎవరికీ ఏజెంట్లం కాం. ప్రజలకే ఏజెంట్లం. ప్రజలే మమ్మల్ని ఏజెంట్లుగా నియమించారు. వారి కోసమే మేం పనిచేస్తాం. మేమెవరికీ గులాంగిరీ చేయం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ.. జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాం’’ అని కేసీఆర్‌ అన్నారు. ప్రతి సమావేశంలో నేను ప్రజలకు విజ్ఞప్తి చేశాను. పార్టీలు, నాయకులు కాదు. ప్రజలే గెలవాలని అన్నాను. ఈ రోజు ప్రజలే గెలిచారు. ఎవరు ఏమన్నా, ఎన్ని విమర్శలు చేసినా మేం పట్టించుకోలేదు.

యువతకు ఉపాధి, ఉద్యోగాలు  లభించేలా చర్యలు  తీసుకుంటాం. తమకు అవకాశాలు రావడంలేదనే బాధ వారిలో ఉంది. నిరుద్యోగ సమస్య దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఉంది. దీన్ని అధిగమించేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటాం . ఉద్యోగ ఖాళీలను కచ్చితంగా భర్తీ చేస్తాం. ఎలాంటి అనుమానాలు యువతకు అక్కర్లేదు. ప్రభుత్వేతర రంగాలో ఉపాధి విరివిగా లభించేలా చర్యలు తీసుకుంటాం అని  చెప్పారు.

leave a reply