న్యూయర్‌ శుభాకాంక్షలు -సీఎం కేసీఆర్‌

తెలుగు ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు పోవాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే ఈ సంవత్సరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నా అని కేసీఆర్‌ తెలియజేశారు.

leave a reply