నిరుద్యోగులకు శుభవార్త..మంత్రి లోకేష్!

ఆంధ్రప్రదేశ్:నిరుద్యోగులకు శుభవార్త..అమరావతి తాడేపల్లిలోని ఇన్ఫోసైట్ భవనంలో కొత్తగా ఆరు  ఐటీ కంపెనీలు ప్రారంభించిన మంత్రి లోకేష్. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ..  ప్రపంచంలోఅన్ని చోట్ల భారతీయ ఐటీ నిపుణులున్నారని, ఐటీ నిపుణుల్లో ఎక్కువ మంది రాష్ట్రానికి చెందిన వారేనన్నారు. విభజనకు ముందు ఐటీ అంతా హైదరాబాద్‌కే పరిమితమైందని, నవ్యాంద్రలో ఐటీ కంపెనీలు ఏర్పాటుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని  చెప్పారు. పెద్ద, చిన్న, మధ్యతరహా తేడా లేకుండా అన్ని రకాల  ఐటీకంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.  జరిగిన నాలుగు సంవత్సరాల్లో  35 వేల పైగా నిరుద్యోగులకు ఐటీ ఉద్యోగాలు కల్పించామని, హెచ్‌సీఎల్‌ లాంటి గొప్ప సంస్థలు రాష్ట్రానికివచ్చాయని ఆయన తెలిపారు. గన్నవరం మేథాటవర్స్‌లో రెండో దశ త్వరలో ప్రారంభిస్తామని, అంతేకాకుండా తాత్కాలికభవనాల్లో 9 ఐటీ కంపెనీలలను తరలించ్చామని చెప్పారు. కంపెనీలకు ఆకర్షణీయంగా రాయితీలు కల్పిస్తున్నామని, నిరుద్యోగులకు యువనేస్తం కింద భృతితో పాటు అభ్యర్థులకు అనుగుణంగా తగిన శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. టీసీఎల్‌ కంపెనీ తిరుపతిలోఏర్పాటు చేస్తామని, రాష్ట్రానికి మరోఎలక్ట్రానిక్‌ కంపెనీలు రాబోతుందని లోకేష్‌ వెల్లడించారు.

leave a reply