విదేశీ విద్యార్థులు ఇక్కడే ఉండొచ్చు

అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు.. విద్యాభ్యాసం తర్వాత ఇక్కడే ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రాంప్‌ అన్నారు. అమెరికాలోని వలసదారుల విధానాల వల్ల ప్రతిభావంతులను కోల్పోతున్నామన్నారు.  చట్టబద్ధమైన వలస విధానాల్లో ఉన్న లొసుగులను అంతం చేయాలన్న ట్రంప్‌.. ప్రతిభ ఆధారంగా అమెరికాకు వలసదారులు రావాలని తన యంత్రాంగం భావిస్తోందన్నారు.

కాగా.. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్‌.. ‘నాకు మంచి గొప్ప టెక్‌ కంపెనీల నుంచి ఫోన్లు వస్తున్నాయి. దేశంలోని మంచి విద్యాసంస్థలలో చదువుకున్న వారిని ఇక్కడ ఉంచలేకపోతున్నామని.. వాళ్లు తిరిగి వేరే దేశాలకు వెళ్లిపోతున్నారని.. ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి.. ఇక్కడ అత్యుత్తమమైన విద్యాసంస్థల్లో చదువుతున్నారు ఇక్కడే ఉండి అమెరికన్‌ కంపెనీల అభివృద్ధికి దోహదపడాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు. మీ కోసం మంచి మంచి కంపెనీలు వెయిట్‌ చేస్తున్నాయని తెలిపారు.

వివిధ కారణాల వల్ల విదేశీ విద్యార్థులు ఇక్కడ ఉండి జాబ్‌ చేసుకునే అవకాశం ఉండట్లేదు. దీంతో గొప్ప ప్రతిభావంతులను కోల్పోతున్నామని తెలిపారు. మీరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు. ఆశ్రయం కావాలని కోరుకునే వారికి చట్టబద్ధమైన విధానాలు ఉన్నాయని పేర్కొన్నారు. గొప్ప కంపెనీలను, ప్రతిభావంతులను వదులుకోమని చెప్పారు.

leave a reply